Wednesday, January 22, 2025

జెసి ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన నటి మాధవిలత

- Advertisement -
- Advertisement -

తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జెసి ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సినీనటి మాధవిలత సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కోరారు. ఈ మేరకు మంగళవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జెసి ప్రభాకర్‌రెడ్డి సినీనటి మాధవిలతపై అసభ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా వివాదం పెద్దది కావడంతో జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. అయినా కూడా వివాదం సద్దుమణగలేదు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ జెసి మాటలతో తాను,

తన కుంటుంబం ఇబ్బంది పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యంగా వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అని, రాజకీయ నాయకులు ఇలాటి భాష మాట్లాడితే ఎలా అన్ని అన్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి మాటలతో తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు. మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. తనపై జెసి వ్యాఖ్యలు చేసినా సినీ ఇండస్ట్రీ కనీసం స్పందించలేదని అన్నారు. గతంలో మాధవీలత జెసి ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మా ట్రెజరర్ శివబాలాజికి ఫిర్యాదు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News