రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ల
తయారీ యూనిట్ల ఏర్పాటు
టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు
ముందుకొచ్చిన స్కైరూట్ సంస్థ
దావోస్‌లో సిఎం రేవంత్‌రెడ్డి,
మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో
సంతకాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏ ర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒ ప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాం కేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్‌లో సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు స మక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సం తకం చేశారు.ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేటు రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను
ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఒప్పందం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేటు రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం తమకు సంతోషంగా ఉందని స్కైరూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామన్నారు