Wednesday, January 22, 2025

మెగా పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

మేఘా ఇంజినీరింగ్ కంపెనీ,రాష్ట్ర ప్రభుత్వం మధ్య మూడు కీలక
ఒప్పందాలు రూ.15వేల కోట్ల పెట్టుబడులు మెగావాట్ల
పంప్డ్ స్టోరేజ్ కోసం రూ.11 వేల కోట్లు పెట్టుబడులు బ్యాటరీ
ఎనర్జీ స్టోరేజ్ కోసం రూ.3 వేల కోట్లు అనంతగిరిలో
ప్రపంచస్థాయి లగ్జరీ వెల్నెస్ రిస్టార్ట్ ఏర్పాటు కోసం రూ.వెయ్యి కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్ (ఎంఇఐఎల్) కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పం దం (ఎంఒయు)పై సంతకాలు చేసింది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు లో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో మెఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కం పెనీ కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టుపై మెఘా ఎంఇఐఎల్ దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. నిర్మాణ దశలో దాదాపు వె య్యి మందికి ఉద్యోగాలు లభించనున్నా యి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వా త అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. ఈ చర్చల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు

ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మే ఘా కంపెనీ అధినేత ప్రకటించారు. దీంతో పాటు మేఘా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరే జీ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మ రో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రమంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఒయుపై సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో 100 ఎంవీహెచ్‌ల బ్యాటరీ ఎనర్జీ స్టో రేజీ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చే స్తుంది. దీనికి రూ.3000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో రెండేండ్ల లో 1000 మందికి ప్రతక్ష్య ఉద్యోగాలు, 3వేలమందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుం ది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. మేఘా కంపెనీ పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు ముందుకొచ్చింది. అనంతగిరిలో ప్రపంచస్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు మెఘా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News