Wednesday, January 22, 2025

కర్నాటకలో రోడ్డు ప్రమాదం…. నలుగురు కర్నూలు వాసులు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలోని సింధనూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాను వాహనం బోల్తాపడడంతో డ్రైవర్‌తో సహా నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గత రాత్రి మంత్రాలయం నుంచి హంపికి విద్యార్థులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. మృతులు కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News