Saturday, February 22, 2025

బస్సు కోసం వెయిటింగ్… మహిళపై ఇద్దరు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళపై ఇద్దరు అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కెఆర్ మార్కెట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల మహిళ ఎళహంక బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుంది. గణేశ్, శరవణన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి ఇక్కడికి బస్సులు రావు అని, కొంచెం దూరంలో మరో బస్టాప్ ఉందని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎస్‌జె పార్కులోకి తీసుకెళ్లి మహిళపై ఇద్దరు అత్యాచారం చేయడంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సదరు మహిళ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ బి దయానందా తెలిపారు. కర్నాటకలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, శాంతిభద్రతలు క్షీణించడంతో హోంమంత్రి పరమేశ్వర్ రాజీనామా చేయాలని బిజెపి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటకలో బిజెపి పాలనలో అత్యాచారాలు జరగలేదా? అని సిఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. సమాజంలో సంఘ వ్యతిరేకులు, నేరస్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News