యాదాద్రి భువనగిరి: స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదర్శనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రతినెల ఒకరోజు ఎంతో మహోత్సవంగా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షణలో భక్తులు పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. యదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దర్శనం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. స్వయాన లక్ష్మీనరసింహస్వామి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు శక్తిని అందించి ఆలయ నిర్మాణానికి పూనుకునేలా కృప కల్పించారన్నారు. ఏళ్ల తరబడి నిలబడేలా, తెలంగాణ ప్రజల కొంగుబంగారంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కెసిఆర్ మహాద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. రూ. 1200 కోట్లతో ఆలయాన్ని సుందరంగా నిర్మించారని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా యాదాద్రిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కవిత విన్నవించారు.
గిరి ప్రదర్శనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా: కవిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -