Wednesday, January 22, 2025

విమానాశ్రయంలో వీల్ ఛైర్ లో రష్మిక…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ రష్మిక మందన జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా ఆమె కాలికి గాయం కావడంతో కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో వీల్‌ఛైర్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాలీవుడ్ సినిమాలలో నటించేందుకు ఆమె ముంబయికి వెళ్లినట్టు సమాచారం. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆమె కారులో బయటకు దిగి ఒంటి కాలుతో నడుస్తూ వీల్ ఛైర్‌లో ఆశీనులయ్యారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు. ఎప్పటివరకు గాయం మానుతుందో ని ఆ భగవంతుడికే తెలియాలని, త్వరగా రికవరీ అయిన తరువాత ‘సికిందర్’, ‘థామ’, ‘కుబేర’ సినిమాలో షూటింగ్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నానన్నారు. ఆలస్యాన్ని క్షమించాలని ఆయా చిత్రాల దర్శకులను కోరారు. తన కాలు గాయం తగ్గిన వెంటనే షూటింగ్‌లో పాల్గొంటానని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్మిక ‘ఛావా’ సినిమాలో నటించారు. ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. ఛావా సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News