Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఐటి శాఖ అధికారుల దాడులు రెండో రోజైన బుధవారం కొనసాగాయి. నగర వ్యాప్తంగా పలు వురు టాలీవుడ్ నిర్మాతల నివాసాల్లో ఏకంగా 55 బృందాలు రంగంలోకి దిగి సోదాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా సినిమా ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఆరా తీస్తున్నారని తెలిసింది. పుష్ప-2 మూవీకి సినిమాకు పెట్టిన బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమా చారం. ఆయా సంస్థలు ఫైల్ చేసిన ఐటి రిటర్న్ భారీగా ఉండటంతో ఐటి అధికారులు రెండో రోజు కూడా తనిఖీలు నిర్వహించారు. మంగళవా రం నుంచి హైదరాబాద్ నగర పరిధిలోని 8 చోట్ల ఐటి అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించిన విషయం విదితమే.

ఐటి దాడులు నా ఒక్కడిపైనే కాదు.. మొత్తం ఇండస్ట్రీపై జరుగుతున్నాయి : దిల్ రాజు
ఇదిలా ఉండగా, టాలీవుడ్‌లో జరుగుతున్న ఐటి దాడులు తన ఒక్కరిపై కాదని, మొత్తం ఇండస్ట్రీపై జరుగుతున్నాయని దిల్ రాజు ప్రకటించారు. అయితే ఆయన ఆలా చెప్పారు కానీ పూర్తి స్థాయిలో వందల కోట్లతో సినిమాలు తీస్తున్న కలెక్షన్లు సాధించిన వారిపైనే ప్రధానంగా దృష్టి పెట్టా రు. ఇంకా చెప్పా లంటే వారికి ఫైనాన్స్ చేస్తున్న వారిని కూడా వదిలి పెట్టలేదు. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాతనే రంగంలోకి దిగారని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాల్లో చూపించినట్లుగా ఒక్క సారిగా జరిగిన ఈ రెయిడ్స్‌తో అగ్రనిర్మాతలకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. ఎందుకటే పెద్దగా బయటకు కనిపించని ఫైనాన్షియర్లపై కూడా రెయిడ్ చేశారు. వారి ఆర్థిక లావాదేవీలన్నీ వెలికి తీశారు. అలాగే సినిమాలను ఏరియాల వారీగా అమ్మినప్పుడు వచ్చే నగదును ఎలా సర్క్యూలేషన్‌లోకి తెస్తారో కూడా ఆరా తీస్తున్నారు.

ఇండస్ట్రీలోని వ్యక్తులే సమాచారం ఇచ్చారా..!?
మొత్తం గా అసలు టాలీవుడ్‌లో బడా నిర్మాతల ఆర్థిక వ్యవహారాలపై పూర్తి సమాచారం ఐటి అధికారులకు ఇండస్ట్రీ నుంచే వెళ్లిందని ఆ మేరకు స్కెచ్ వేసుకుని మరీ రంగంలోకి దిగారని అంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నిర్మాతలు ఇప్పుడు అంత దూకుడుగా సిని మాలు తీయడం లేదు. సురేష్ ప్రొడక్షన్స్ చాలా పరిమితంగా సినిమాలు చేస్తోంది. గీతా ఆర్ట్ చాలా సెలక్టివ్‌గా ఉంటోంది. ఇతర నిర్మాతలు మాత్రం చాలా దూకుడగా ఉంటున్నారు. వీరందరికీ ఇండస్ట్రీలో డబ్బు గోడౌన్లుగా ప్రసిద్ధి చెందిన కొంత మంది ఫైనాన్షియర్లు అండగా ఉంటు న్నారు. రాజకీయ నేతల సొమ్ములకు వీరు బినామీలుగా ఉండి సినీ ఇండస్ట్రీలోకి పంప్ చేస్తారని భావిస్తున్నారు.

ఇలాంటి డబ్బు గోడౌన్ల గురించి పూర్తి సమాచారంతో ఐటి అధికారులు దాడులు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. సినీ ప్రముఖులపై ఐటి దాడులు సహజంగానే జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ జరిగే వాటికి ఇప్పుడు జరుగుతున్న వాటికి చాలా తేడా ఉంది. గతంలో ఎవరో ఒకరిపై దాడులు చేసి సోదాలు చేసి వెళ్లిపోయే వారు. కానీ ఆ సారి మొత్తం లావాదేవీల గుట్టు బయటకు లాగేందుకు చాలా పెద్ద ప్రణాళికతో వందల మంది వచ్చి సోదాలు చేస్తు న్నారు. అంత తేలికగా ఈ వ్యవహారం సమసిపోదని, మొత్తం టాలీవుడ్ ఆర్థిక మూలాలను గట్టిగా పట్టుకుంటారని అంటున్నారు. అందుకే టాలీవుడ్‌లో ఈ ఐటి దాడులు సంచలనంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News