- Advertisement -
లోన్ యాప్ వేధింపులతో యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటనా బాల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వినాయక నగర్లో నివాసముండే లక్ష్మారెడ్డి కుమారుడు తరుణ్ రెడ్డి (21) బిటెక్ పూర్తి చేసి ఉద్యోగం లేక లోన్ యాప్ లలో డబ్బులు తీసుకున్నాడు. సమయానికి డబ్బులు కట్టలేదు. దీంతో యాప్ నుంచి వేధింపులు ఎక్కువైనాయి. వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -