Thursday, January 23, 2025

నడిరోడ్డుపై ఆటో డ్రైవర్ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

హనుమకొండ పట్టణంలోని సుబేదారి డీమార్ట్ ఎదురుగా హైదరాబాద్ రహదారిపై ఒక వ్యక్తి దారుణ హత్య గురయ్యాడు. ఈ సంఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది. సానికులు, పోలీసుల కథనం ప్రకారం… ఏనుగు వెంకటేశ్వర్లు అనే ఆటో డ్రైవర్ మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఇద్దరు లావణ్య అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ క్రమంలో రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు మధ్య గొడవ జరిగింది.

సుబేదారి డీమార్ట్ ఎదురుగా ఇద్దరు కలుసుకుని మాట్లాడుతుండగా వారి మధ్య మాట మాట పెరిగి ఏనుగు వెంకటేశ్వర్లు తన వెంట తెచ్చుకున్న కత్తితో మాచర్ల రాజ్ కుమార్‌ను పొడవడంతో అక్కడ మృతి చెందాడు. వెంకటేశ్వర్లు ఆటోతో వెంటపడి, ఆపి హత్య చేశాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజిఎంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడు, మృతుడు ఇద్దరూ ఆటో డ్రైవర్లు కావడం, కాజీపేట మడికొండకు చెందినవారు కావడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News