Thursday, January 23, 2025

బోణీ కొట్టిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టి20లో ఆతిథ్య భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. మిగతా వారిలో బ్రూక్ (17), ఆర్చర్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు.

ఆతిథ్య జట్టు బౌలర్లలో వరుణ్ మూడు, అర్ష్‌దీప్, హార్దిక్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ జట్టుకు శుభారంభం అందించారు. శాంసన్ 4 ఫోర్లు, సిక్స్‌తో 26 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో 79 పరుగులు సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News