Thursday, January 23, 2025

ట్రంప్ ఆర్డర్‌పై న్యాయపోరాటం

- Advertisement -
- Advertisement -

జన్మతః పౌరసత్వం రద్దుపై అడ్డం
తిరిగిన 22 డెమోక్రటిక్ రాష్ట్రాలు
న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు
అదేబాటలో పౌరహక్కుల సంస్థలు

వాషింగ్టన్ : అమెరికా కొత్త ప్రెసిడెంట్ డోనా ల్డ్ ట్రంప్ కు ఆదిలోనే హంసపాదు ఎదురైం ది. అమెరికా గడ్డపై పుట్టిన పిల్లలకు ఆటోమాటిక్‌గా పౌరసత్వం వీలు కల్పించే నిబంధనను రద్దు చేస్తూ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు వ్యతిరేకత ఎదురైంది. దాదాపు 22 అమెరికా రాష్ట్రాలు ఈ ఆర్డర్ ను సవాల్ చేస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉ న్న ఈ రాష్ట్రాలు ట్రంప్ తెంపరి తనాన్ని ఏ వి ధంగా అడ్డుకుంటాయి అన్నది ప్రశ్న. అమెరికాకు వలసదారుల నియంత్రణకోసం ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. ఒక బిడ్డకు జన్మనిచ్చే తల్లి చట్ట వ్యతిరేకంగా , తండ్రి చట్టప్రకారం అమెరికా శాశ్వత పౌరుడు కాకపోయినా.. ఆ పుట్టే బిడ్డకు ఆటోమాటిక్ గా పౌరసత్వం లభించదని ట్రంప్ ఈ ఆర్డర్ లో పేర్కొన్నారు. ఆ ఆర్డర్ ను సవాల్ చేస్తూ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ , త్వరలో బిడ్డను కననున్న ఓ తల్లి మొదట్లోనే రెండు కేసులు దాఖలు చేశారు.

ఆర్డర్ జారీ అయిన గంటల్లోనే కొత్త అడ్మినిస్ట్రేషన్ పై కీలకమైన కోర్టుకేసు దాఖలైంది. అమెరికా పౌరసత్వం పొందేందుకు కేవలం బిడ్డను కనేందుకే కొందరు మహిళలు అమెరికాకు వస్తున్నారన్న ట్రంప్ ఫిర్యాదును డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, పౌరహక్కుల సంస్థలు ప్రశ్నించాయి.డిస్ట్రిక్ట్ ఆప్ కొలంబియా, శాన్ ప్రాన్సిస్కో సిటీ తో సహా 22 స్టేట్ లు బోస్టన్, సియాటల్ ఫెడరల్ కోర్టులలో కేసులు పెట్టాయి. ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి , తన అధికారాలను మించి ఈఆర్డర్ జారీ చేశారని వారు పిటిషన్ లలో పేర్కొన్నారు. ట్రంప్ ఆర్డర్ అమలైతే దాదాపు లక్షన్నర మంది పిల్లలు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందే అధికారాన్ని కోల్పోతారని మాసచుసెట్స్ అటార్నీ జనరల్ ఆండే జోయ్ కాంప్ బెల్ అన్నారు.

రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాదనే అధికారం అమెరికన్ ప్రెసిడెంట్ కు లేదని ఆమె వివరించారు.
అమెరికా రాజ్యాంగంలో 1868లో చేసిన 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై ఎవరు పుట్టినా అటోమాటిక్ గా పౌరసత్వం లభిస్తుంది. అమెరికాలో జన్మించినవారు, ఇక్కడి పౌరులు వారు ఏ స్టేట్ కు సంబంధించిన వారైనా 1952 ఎమిగ్రేషన్, జాతీయ చట్టం ప్రకారం పౌరులుగా రాజ్యాంగ సవరణ పేర్కొంది. అమెరికా సుప్రీం కోర్ట్ 1898లో వాంగ్ కిమ్ ఆర్క్ v యునైటెడ్ స్టేట్స్ తీర్పులో వలసదారుల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వం వర్తిస్తుందని ధృవీకరించింది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంచనా ప్రకారం, 2022జనవరిలో అమెరికాలో 11 మిలియన్ల అక్రమ వలసదారులు ఉన్నారు. కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు 13 మిలియన్ల నుండి 14 మిలియన్ల వరకు ఉన్నారని అంటున్నారు. అమెరికా లో జన్మించిన వారి పిల్లలకు యుఎస్ పౌరసత్వం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News