దావోస్‌లో ఆసక్తికర పరిణామం
‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’
సమావేశంలో మూడురాష్ట్రాల
సిఎంలకు చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకే వేదికను పంచుకున్నారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ‘కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్’ సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల సిఎంలు పాల్గొని దేశ సమగ్రాభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. ఈ ముగ్గురిలో రేవంత్ రెడ్డి ఇండియా కూటమికి చెందిన సిఎం కాగా, చంద్రబాబు నాయుడు, ఫడ్నవీస్ ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రులు కావడం గమనార్హం. వీరు ముగ్గురు సౌత్‌ఇండియాకు చెందిన సిఎంలు కావడం మరో విశేషం.
టీమిండియా
- Advertisement -
- Advertisement -
- Advertisement -