పదేళ్ల సక్సెస్‌ఫుల్ జర్నీ
“ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక అద్భుతమైన అనుభవాన్నిచ్చిం ది. ప్రతి హీరోతో ఒక అద్భు తమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియ న్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్‌గా ఈ పొంగల్ కి ’సంక్రాంతికి వస్తున్నాం’తో ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు. ’సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ నా కెరీర్‌లో ఓ హిస్టరీ”అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. దర్శకుడిగా ఆయన జర్నీకి జనవరి 23తో పదేళ్ళు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అనిల్ రావిపూడి ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఇది నా కెరీర్‌లో హిస్టరీ…
ఈ పొంగల్‌కి ’సంక్రాంతికి వస్తున్నాం’తో అద్భుతమైన విజయం ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మామూలు సక్సెస్ కాదు. ఇది నా కెరీర్‌లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఈ బలం వుందని ఆడియన్స్ నిరూపించారు.
అదే చేసుకుంటూ వస్తున్నా..
డైరెక్టర్ కావడం నా డ్రీం. అది ’పటాస్’ తో తీరిపోయింది. ఇదంతా బోనస్‌గా భావిస్తున్నాను. నాకు లైఫ్ ఇచ్చింది ఆడియన్స్. వారికి పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే నా టార్గెట్. అదే చేసుకుంటూ వస్తున్నాను.
ప్రతి సినిమా మరచిపోలేని అనుభవం..
ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక అద్భుతమైన అనుభవాన్నిచ్చింది. కళ్యాణ్ రామ్ లేకపొతే నా కెరీర్ లేదు. ఆయన ప్రొడ్యూస్ చేసి నన్ను డైరెక్టర్‌గా నిలబెట్టారు. ఈ పదేళ్ళ క్రెడిట్ ముందు కళ్యాణ్ రామ్‌కి ఇస్తాను. తర్వాత సాయిధరమ్ తేజ్‌తో సుప్రీం, రవితేజతో రాజా ది గ్రేట్, వెంకటేష్‌తో ఎఫ్2, సూపర్ స్టార్ మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు, మళ్లీ వెంకీతో ఎఫ్3, బాలకృష్ణతో భగవంత్ కేసరి, మళ్లీ వెంకీతో సంక్రాంతికి వస్తున్నాము.. ప్రతి హీరోతో ప్రతి సినిమా ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. నేను సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టిన హీరోలతో కలిసి పనిచేయడం అల్టిమేట్ ఫీలింగ్.
ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప తీర్పు..
ఎఫ్ 2 లాంటి మంచి ఎంటర్‌టైనర్ తీద్దామని అనుకొని సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేశాము. ఎఫ్ 2లా ఆడితే చాలు అనుకున్నా, సంక్రాంతికి వస్తున్నాం మా అంచనాలను మించి ఆడుతోంది. ఇది వెంకటేష్‌కి, మా టీం అందరికీ ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప తీర్పు.
చాలా ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు..
సంక్రాంతి సీజన్ 20 శాతం కలిసి వస్తుంది. 80 శాతం కంటెంట్‌లో విషయం ఉండాలి. సంక్రాంతికి వస్తున్నాము సినిమాలో కంటెంట్ పరంగా మేము కొత్తగా ఫీల్ అయింది ఒక భార్య, ఒక మాజీ ప్రేయసితో ఒక వ్యక్తి ప్రయాణం. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా నేను ఎక్కడా చూడలేదు. ప్రేక్షకులు ఇది చాలా ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారు. ఆడియన్స్ కంటెంట్‌ని కొత్తగా ఫీల్ అవ్వడం వల్లే ఇంత గొప్ప జడ్జిమెంట్ ఇచ్చారని భావిస్తున్నాను.
అదే నా సక్సెస్ సీక్రెట్…
థియేటర్స్‌లో ఆడియన్స్‌కి చాలా దగ్గరగా ఉండి కథ రాసుకుంటాను. నా నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమా కోరుకుంటారు, అసలు నా బలం ఏమిటి అనేది తెలుసుకొని సినిమా చేస్తాను. ప్రతి సినిమా ఫ్రెష్‌గా ఉండేటట్లు చూసుకుంటాను. అదే నా సక్సెస్ సీక్రెట్.
అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా…
చిరంజీవితో చేయబోయే సినిమా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి జోనర్‌లో చేయాలనే హోమ్ వర్క్ జరుగుతోంది. వందశాతం అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా చిరంజీవిని చూపించాలని పట్టుదలతో పనిచేస్తున్నాను. అదేవిధంగా నాగర్జునతో సినిమా -వందశాతం చేస్తాను. ఆయనతో హలో బ్రదర్ లాంటి సినిమా చేయాలని వుంది. నేను చూసిన ఫోర్ పిల్లర్స్‌తో నాలుగు సినిమాలు చేశాననే రికార్డ్ కూడా నాకు వుంటుంది.