- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేతను హతమయ్యారు. మావోయిస్టులు భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రమోద్ మృతి చెందారు. ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని భద్రతా బలగాలు వెల్లడించాయి. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇంఛార్జ్‌గా చంద్రహాస్ పనిచేశారు. చంద్రహాస్‌పై రూ.20 లక్షలకు పైగా రివార్డు కూడా ఉంది. ఛత్తీస్‌గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబాద్ లో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 27 మావోయిస్టులు మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -