- Advertisement -
ముంబయి: దర్శకుడు రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఆర్ జివిని కోర్టు దోషిగా తేల్చింది. ఆర్ జివికి 3 నెలల జైలు శిక్ష, రూ.3.72 లక్షల జరిమానాను ముంబై అంథేరి కోర్టు విధించింది. ఫిర్యాదుదారునికి డబ్బు ఇవ్వకపోతే మరో 3 నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చింది. ఎపి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యూహం సినిమాలో భాగంగా టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఆర్ జివిపై మూడు కేసులు నమోదైన విషయం విధితమే.
- Advertisement -