Thursday, January 23, 2025

పటాన్ చెరులో ఉద్రిక్తత…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వద్ద చేపట్టిన కాంగ్రెస్‌ ధర్నాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చింది. పటాన్‌చెరు చౌరస్తా వద్ద మహిపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల యత్నించారు. సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు స్లోగన్ తో కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కారు. పార్టీ మారి వచ్చిన గూడెం తన అనుచర వర్గంతో కాంగ్రెస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పాత కొత్త నేతల పంచాయితీ సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. నిరసనగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడించారు. కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. కొన్ని రోజుల క్రితం బొల్లారంలో అసలైన కాంగ్రెస్ నాయకులను మహిపాల్ రెడ్డి బూతులు తిట్టిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News