Friday, January 24, 2025

చేదు నిజాన్ని క్షమాపణ మార్చలేదు.. ట్రంప్ నిర్ణయంపై న్యాయమూర్తుల వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేసిన తన మద్దతుదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని ముగ్గురు ఫెడరల్ న్యాయమూర్తులు ఖండించారు. అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ తరువాత ట్రంప్ , 2021 జనవరి 6 నాటి దాడుల్లో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్షను ప్రకటించారు. దీనిపై న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ స్సందిస్తూ ఆ చేదునిజాన్ని ఏ క్షమాపణ మార్చలేదు. శాంతియుతంగా జరగాల్సిన అధికార మార్పిడిలో చోటుచేసుకున్న ఉల్లంఘనను సరిదిద్దలేరు ” అని వ్యాఖ్యానించారు. ‘2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి మోసం జరగలేదు. శాంతియుతంగా జరగాల్సిన అధికార బదిలీకి నాడు ఓడిపోయిన వారు ఆటంకం కలిగించడం సరికాదు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కావచ్చు’ అని జడ్జి బెరిల్ హూవెల్ అన్నారు. ఇలాగే మరో న్యాయమూర్తి కొలీన్ కొల్లార్ కోటెల్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోలు , విచారణ రికార్డులు, జ్యురీ తీర్పులను భద్రపరిచినట్టు తెలిపారు. 2021 జనవరి 26న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఆవేశ పూరితంగా ప్రసంగించారు. దీంతో వారు వేలాదిగా క్యాపిటల్ భవనం లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ సంఘటనలో 140 మందికి పైగా పోలీస్ అధికారులు గాయపడ్డారు. దాడుల్లో పాల్గొన్న 1500 మందిపై వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్‌షీట్‌లో ట్రంప్ పేరు కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News