Friday, January 24, 2025

అంతుచిక్కని మరణాలకు అంటువ్యాధి కారణం కాదు : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంటున్న మిస్టరీ మరణాలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. వీటికి అంటువ్యాధి కారణం కాదని వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా లోని బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 17 మంది అనూహ్యరీతిలో ప్రాణాలు కోల్పోయారు. “ ఈ మరణాలకు బ్యాక్టీరియా, వైరస్, కారణం కాదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని విషపూరిత పదార్ధాలను గుర్తించాం. అవి ఏమిటో నిర్ధారించే దిశగా దర్యాప్తు జరుగుతోంది. ఇతర కోణాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఏదైనా కుట్ర ఉందని తేలితే , తగిన చర్యలు తీసుకుంటాం ” అని మంత్రి వెల్లడించారు.

ఇదిలా ఉంటే ,బుధాల్ గ్రామాన్ని ఇప్పటికే అధికారులు కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇకపై గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలు జరపకూడదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. అయితే బాధిత కుటుంబాలు , వారి సన్నిహితులు ప్రభుత్వ అధికారులు అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, వారి ఇళ్లలో ఉన్న ఇతర పదార్థాలను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కేసు దర్యాప్తు లో భాగంగా బాధిత కుటుంబాల ఇళ్ల లోని ఆహార పదార్ధాలను స్వాధీనం చేసుకొని పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. 11 మందితో కూడిన బృందం ఈ మిస్టరీ మరణాలపై దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News