- Advertisement -
ప్రయాగ్‌రాజ్ : మహాకుంభమేళాలో గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకరసంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించారు. 1.7 కోట్ల మంది పౌష్ పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో పండగల వేళలో స్నానాల ప్రదేశంలో భక్తుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితులు విధించింది. మిగిలిన రోజుల్లో ఎలాంటి ఆంక్షలు అమలులో ఉండవు. అయితే ఈసారి కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా. ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది.
- Advertisement -