Friday, January 24, 2025

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం 1200 విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టింది: మోడీ

- Advertisement -
- Advertisement -

దేశ రాజధానిలో కర్బనాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1200 విద్యుత్తు బస్సులు ఢిల్లీలో నడుస్తున్నాయని, మరిన్ని విద్యుత్తు బస్సులను కూడా ఇస్తామని, ఇండ్లపైకప్పుపై సోలార్ ప్యానెళ్లను పెట్టించడం మరో చొరవ అని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తెలిపారు. పాత పార్లమెంటు భవన్‌లోని సెంట్రల్ హాల్‌లో ఆయన విద్యార్థులతో మాటామంతీ జరుపుతూ ఈ విషయం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ జన్మదినోత్సవం సందర్భంగా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మోడీ ఓ విద్యార్థినీని ‘నీకు నచ్చిన సుభాష్ చంద్ర బోస్ నినాదం ఏమిటి?’ అని ప్రశ్నించగా, ఆ విద్యార్థినీ ‘నాకు రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్య్రం వాగ్దానం చేస్తా’ అని తెలిపింది.

దీనిని అధికార ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె ఇంకా ఆయన అన్నిటి కన్నా దేశం ప్రధానం అన్నారని, ఆయన ఆ అంకిత భావమే నేటికి విద్యార్థులకు ప్రేరణగా ఉందన్నది. అంతేకాక నేడు దేశంలో కర్బనాన్ని తగ్గించే ప్రేరణ కూడా ఆయన నుంచే వచ్చిందని ఆమె పేర్కొంది. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్(ఎస్‌డిజిస్) కూడా అందులో భాగమే అన్నది. అందుకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోంది? అని ప్రశ్నించినప్పుడు ఆమె ‘విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టింది’ అని జవాబిచ్చింది.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిని 1200 విద్యుత్తు బస్సలు నడుస్తున్నాయని, మరిన్ని తెస్తామని అన్నారు. అలాగే రూఫ్‌టాప్ ఎలక్ట్రిక్ ప్యానెల్స్ నెలకొల్పడం మరో చొరవ అని, ఇది ‘పిఎం సూర్యగఢ్ యోజన’ అని, దీనివల్ల విద్యుత్తు బిల్లులను తొలగించొచ్చని అన్నారు. మిగులు విద్యుత్తు ఉత్పత్తి చేస్తే దానిని ప్రభుత్వానికి అమ్మవచ్చని, అందుకు డబ్బు పరిహారంగా అందుతుందని అన్నారని అధికారిక ప్రకటన పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News