పబ్బుల నిర్వాకం మరొకటి బయపడింది, చాలా పబ్బులపై పలు విమర్శలు వచ్చినా, ఇప్పుడు ఏకంగా చిన్నారిని అనుమతించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పబ్బుల్లో మేజర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది, మైనర్లను ఎట్టిపరిస్థితిలో అనుమతించవద్దని ఎక్సైజ్ అధికారులు అనుమతి ఇచ్చిన సమయంలోనే స్పష్టం చేస్తారు. కానీ డబ్బుల సంపాదనకు అలవాటు పడిన పబ్బుల యజమానులు నిబంధనలు పాటించడంలేదు. ఓ చిన్నారిని పబ్బులోకి అనుమతించడమే కాకుండా, డ్యాన్స్ కూడా చేయించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటికి రావడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పబ్బును తనిఖీ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మదీనగూడలో ఉన్న పబ్బు చిన్నారితో డ్యాన్సులు కూడా చేయించారు.
చిన్నారి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఇదే విధంగా పబ్బుల్లోకి మైనర్లను అనుమతించారు, మైనర్లకు సంబంధించి వీడియోలు వైరల్ కావడంతో వారిపై కేసులు నమోదు చేశారు. కొద్దిరోజుల నుంచి ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల నిఘా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పబ్‌లో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.