విపత్తు నిర్వహణలో అద్భుతంగా పనిచేసినందుకు హైదరాబాద్ కు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ – ఐఎన్ సిఓఐఎస్- సంస్థకు… సంస్థాగత విభాగంలో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2025 లభించింది. ఈ అవార్డు కింద రూ.51 లక్షల నగదు, సర్టిఫికెట్‌ను అందజేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.స్వాతంత్య్ర సమరయోధుడు, అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జన్మదినం రోజున ప్రతి ఏడాది జనవరి 23న అందజేసే ఈ అవార్డును ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ ఏర్పాటు చేసింది. విపత్తుల నిర్వహణలో నిస్వార్థంగా, అంకిత భావంతో కృషి చేసిన సంస్థలకు, వ్యక్తులకు ఈ పురస్కారం అందజేస్తారు.
2024 జూలై 1 నుంచి ఈ అవార్డుకు నామినేషన్లను ఆహ్వానించగా వేర్వేరు సంస్థలు, వ్యక్తుల నుంచి 297 నామినేషన్లు వచ్చాయి.హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థ 1999లో ఏర్పడింది. భారతదేశంలో విపత్తు నిర్వహణ వ్యూహంలో భాగంగా ఈ సంస్థను ఏర్పాటుచేశారు. సముద్ర సంబంధమైన ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలలు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. సునామీలు వచ్చే అవకాశం ఉం.. 10 నిముషాల ముందుగా హెచ్చరించే సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ భారత దేశంతో సహా 28 హిందూమహా సముద్రదేశాలకు సేవలు అందిస్తుంది.