Friday, January 24, 2025

భారత్ హ్యాట్రిక్ విజయం

- Advertisement -
- Advertisement -

మలేసియా వేదికగా జరుగుతున్న అండర్19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత్ తన జోరును కొనసాగిస్తోంది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యువ భారత్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తెలుగుతేజం గొంగడి త్రిష ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న త్రిష 44 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 49 పరుగులు సాధించింది. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 58 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. లంక జట్టులో రష్మిక సెవ్వండి (15) ఒక్కటే రెండంకెల స్కోరును అందుకుంది. భారత బౌలర్లలో షబ్నమ్, జోషిత, పరుణికా సిసోధియా రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను శ్రీలంక బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. త్రిష (49) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వారిలో కెప్టెన్ నిక్కి ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), జోషిత (16) పరుగులు చేశారు. లంక బౌలర్లలో ప్రముది, తలగునె, తిలకరత్నె రెండేసి వికెట్లను పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News