స్టార్ హీరోయిన్ అయి మంచి పారితోషికం తీసుకుంటున్నా కూడా కొందరు అందాల తారలకు జీవితం సంతృప్తికరంగా అనిపించదు. ఎందుకంటే బయట ప్రజల్లో వారు స్వేచ్ఛగా తిరగలేకపోతుంటారు. మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్‌కు కూడా తన జీవితం హ్యాపీగా అనిపించడం లేదట. సినిమాల్లో వచ్చి స్టార్‌గా ఎదిగి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ ఛాన్స్ వస్తే సినిమాలు వదిలి ఏదైనా రంగంలోకి వెళ్తానని అంటోంది.
నిత్యాకు పైలెట్ అవ్వాలని ఉండేదట కానీ నటిని అయ్యానని.. నటిగా మారిన తర్వాత స్వేచ్చగా జీవించడం కూడా మర్చిపోవాల్సి వచ్చిందని వాపోయింది. సెలబ్రిటీలా కాకుండా కామన్ మ్యాన్ జీవితాన్ని ఇష్టపడతానని అంటోంది నిత్యా మీనన్. పార్కుల్లో వాకింగ్ ఇష్టం కానీ అది అసలు సాధ్యం కాదని అంటోంది. ఇక నిత్యామీనన్ కోలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. రవి మోహన్‌తో ఒక సినిమా చేస్తున్న ఈ భామ ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఇండ్లీ కడై సినిమాలో కూడా నటిస్తోంది.