Friday, January 24, 2025

లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మొదలైన కార్చిచ్చు

- Advertisement -
- Advertisement -

అమెరికా లోని లాస్ ఏంజెలెస్‌లో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు ఇంకా శాంతించడం లేదు. దీనికి తోడు తాజాగా మరో ప్రాంతంలో కొత్తగా మంటలు చెలరేగాయి. కాస్టాయిక్ లేక్ సమీపం లోని బుధవారం ఉదయం నుంచి కొండల ప్రాంతం నుంచి అగ్నికీలలు విస్తరిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇవి కేవలం కొన్ని గంటల వ్యవధి లోనే 8 వేలకు పైగా ఎకరాలకు వ్యాపించినట్టు తెలిపారు.

దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాలను ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్, పాలిసేడ్స్‌కు కేవలం 64 కిమీ దూరం లోనే ఈ ప్రాంతం ఉంది. దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి. తాజా కార్చిచ్చుతో దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News