Sunday, February 23, 2025

మావోల భారీ డంప్ స్వాధీనం

- Advertisement -
- Advertisement -

చత్తీస్‌గఢ్‌లోని సుక్మా
జిల్లాలో బయటపడిన
భారీ ఆయుధాగారం
21ఐఇడిలు, భారీ
సంఖ్యలో బ్యారెల్
గ్రెనెడ్ లాంచర్లు, పెద్ద
మొత్తంలో పేలుడు
పదార్థాలు, తుపాకీ
తయారీ పరికరాలు
స్వాధీనం

సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సూక్మా జిల్లాలో గురువారం 203 కోబ్రా బెటాలియన్, సిఆర్పిఎఫ్ 131 మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టాయి. సుక్మా జిల్లాలోని మెటగుడెం, డ్యూలర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో గణనీయమైన పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ పరికరాలను విజయవంతంగా కనుగొన్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు 203 కోబ్రాకు చెందిన 5 బృందాలు, 131 బెటాలియన్ సిఆర్‌పిఎఫ్‌కి చెందిన ఏ, డి కంపెనీలతో కలిసి విస్తృతమైన శోధన ఆపరేషన్ నిర్వహించాయి. మెటగూడెం గ్రామం నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక గుహ దాక్కునే ప్రదేశాన్ని కనుగొంది.

ఆ గుహ నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధశాలలో సబ్బు కేసులలో ప్యాక్ చేయబడిన 21 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (ఐఈడి),లు బహుళ బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బిజిఎల్) బాంబులు, ఒక జనరేటర్ సెట్, లాత్ మెషిన్ ఉపకరణాలు, గణనీయమైన పరిమాణంలో పేలుడు తయారీ పదార్థాలు, తుపాకీ తయారీ పరికరాలు, వైద్య సామగ్రి ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద ఎదురుదెబ్బ అని సీనియర్ భద్రతా అధికారి అన్నారు. 203 కోబ్రా నుండి ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌లు, బాంబు గుర్తింపు బృందాలు దాచిన ఈ వస్తువులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయని అధికారి తెలిపారు. ఈ ప్రాంతంలో బయటపడిన ఈ సామాగ్రి ద్వారా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను (ఎఫ్‌ఓబి) లక్ష్యంగా చేసుకునేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని భద్రత బలగాలు భావిస్తున్నాయి.

50 కిలోల ఐఈడిని గుర్తించి పేల్చిన భద్రత బలగాలు
బీజాపూర్ జిల్లా భాసగుడ ఆవుపల్లి మధ్యలో రాష్ట్రీయ రహదారిపై మావోయిస్టుల అమర్చిన 50 కిలోల ఐఈడిను భద్రతా బలగాలు గుర్తించి పేల్చివేయటంతో పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News