Friday, January 24, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రిపుల్ బ్లాక్‌బస్టర్

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ’సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బాక్సాఫీస్ సంభవం క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ “సంక్రాంతికి నిజాయితీగా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఆడియన్స్ సినిమాని నెక్స్ లెవెల్‌కి తీసుకెళ్ళారు. సంక్రాంతికి వస్తున్నాం హిట్ కాదు.. ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ అంటున్నారు. నేను తొలిసారి కలిసినప్పుడు అనిల్ ఓ రైటర్. తనలో అప్పుడే ఒక స్పార్క్ కనిపించింది. తనతో ఎప్పుడూ ఓ ఫ్రెండ్ లానే వుంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం. అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్‌గా వుంటుంది”అని అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ “-మా సినిమాకు మంచి ప్రశంసలు రావడంతో పాటు వసూళ్లు కూడా మేము ఊహించినదాని కంటే అద్భుతంగా రావడం చాలా ఆనందంగా వుంది. వచ్చిన ప్రతి రూపాయి ప్రేక్షకుడి నవ్వుతో రావడం చాలా హ్యాపీగా వుంది. -సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు సినిమాకి రావడం ఆనందంగా వుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గారు ముఫ్ఫై ఏళ్ళుగా థియేటర్ కి వెళ్ళలేదు. మొన్న ఈ సినిమా చూశారు. ఇది చాలా ఎమోషల్ గా అనిపించింది. మామూలు సినీ గోయర్స్ తో పాటు సినిమాకి దూరమైన ఓ రెండు శాతం ఆడియన్స్ కూడా వచ్చి చూడటం జరిగింది. ఇక -భీమ్స్‌లో నాకు నచ్చే క్యాలిటీ దర్శకుడి కావాల్సిన మ్యూజిక్ ఇవ్వడం. ఈ పొంగల్ తో భీమ్స్ టైం మొదలైయింది. నెక్స్ పదేళ్ళు తనదే. తనతో నా జర్నీ వుంటుంది”అని తెలిపారు. ఈ సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News