- Advertisement -
యువ సామ్రాట్ నాగచైతన్య మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయకు అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను విడుదల చేశారు. హైలెస్సో హైలెస్సా సాంగ్ నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా చూపించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హృదయాన్ని తాకే మరొక లవ్ మెలోడీని కంపోజ్ చేశారు. శ్రేయ ఘోషల్, నకాష్ అజీజ్ మధురమైన గాత్రంతో ఈ పాట అందరినీ అలరిస్తోంది. సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా వుంది. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
- Advertisement -