- Advertisement -
అమరావతి: విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామనపల్లి గ్రామంలో విద్యుత్ అంతరాయం కలగడంతో శివకుమార్(48) అనే లైన్‌మెన్ అక్కడికి వెళ్లాడు. పంట పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న స్తంభం ఎక్కి ప్యూజ్ అమర్చుతుండగా శివకు తగలడంతో అక్కడే చనిపోయాడు. వెంటనే విద్యుత్ ఉన్నతాధికారులకు రైతులు సమాచారం ఇచ్చారు. పోలీసులు, విద్యుత్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.
- Advertisement -