Friday, January 24, 2025

విడాకులు తీసుకోబోతున్న సెహ్వాగ్ దంపతులు..!

- Advertisement -
- Advertisement -

ఇటీవలకాలంలో సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం సాదారణమైపోయింది. చిన్న చిన్న కారణాలు, మనస్పర్థాలతో విడిపోతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తన భార్య ఆర్తి అహ్లావత్ నుంచి సెహ్వాగ్ విడాకులు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొన్ని నెలలుగా వీరిద్దరూ విడిగా ఉంటున్నారని.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2004లో ఆర్తిని సెహ్వాగ్ పెళ్లి చేసుకున్నాడు. దీంతో దాదాపు 20 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News