- Advertisement -
హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలోని టిఫిన్ సెంటర్ లో ఉదయం గ్యాస్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో.. పక్కనున్న మరో మూడు షాపులకు మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
- Advertisement -