Friday, January 24, 2025

లక్డీకపూల్ లో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని లక్డీకపూల్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మూసాపేట్ నుంచి కాటేదాన్ వెళ్లే క్రమంలో లక్డికాపూల్ మెట్రో స్టేషన్ టర్నింగ్ వద్ద కంటైనర్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు, క్లీనర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్, క్లీనర్ లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో రోడ్డుపై రద్దీ లేకపోవడంతో వాహనదారులకు ప్రమాదం తప్పింది. లేకపోతే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. క్రేన్ సహాయంతో బోల్తా పడిన లారీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News