Saturday, January 25, 2025

ఐసిసి వన్డే జట్టు ప్రకటన.. భారత క్రికెటర్లకు నో చాన్స్

- Advertisement -
- Advertisement -

వన్డే టీమ్ ఆమ్ ది ఇయర్ 2024ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) ప్రకటించింది. శుక్రవారం జట్టు జాబితాను వెల్లడించింది. శ్రీలంక ప్లేయర్ చిరిత్ అసలంక సారథ్యంలో 11 మందితో కూడిని జట్టు జాబితాను విడుదల చేసింది. ఈ జట్టులో పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ ప్లేయర్స్ ను ఎంపిక చేయగా.. ఒక్క భారత ప్లేయర్ కు కూడా చోటు దక్కలేదు. అయితే, 2024 క్యాలెండర్ సంవత్సరంలో టీమిండియా కేవలం మూడు ODI మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. శ్రీలంకపై మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడిన భారత్.. రెండింటిలో ఓడగా.. మరొకటి డ్రాగా ముగిసింది. అందుకే ఐసిసి వన్డే జట్టుకు టీమిండియా క్రికెటర్లలో ఎవరూ ఎంపిక కాలేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నలుగురు శ్రీలంక ఆటగాళ్లు, పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్ జట్ల నుంచి ముగ్గురు, విండీస్ నుంచి ఒకరికి చోటు దక్కింది.

వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024:

సైమ్ అయూబ్ (పాకిస్థాన్‌), రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్), పాథున్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక), చరిత్ అసలంక (కెప్టెన్) (శ్రీలంక), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్‌ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్), వనిందు హసరంగ (శ్రీలంక), షహీన్ షా అఫ్రిది (పాకిస్థాన్), హారిస్‌ రవూఫ్‌ (పాకిస్థాన్), ఏఎం ఘజాన్‌ఫర్ (అఫ్గానిస్థాన్).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News