స్త్రీ, పురుష సమాన భాగస్వామ్యం లేకుండా భూమిపై మానవజాతి ఉనికి అసాధ్యం. భూమిపై మానవజాతి ఉనికి పురుషుడి కంటే స్త్రీకి చాలా అవసరమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమె మరో మనిషికి జన్మనిస్తుంది కాబట్టి. మానవజాతి కొనసాగింపుకోసం ఆడపిల్లలను రక్షించి, గౌరవించి, సమాన అవకాశాలు కల్పించి ముందుకు సాగాలి. కొన్నిచోట్ల ఆధునిక నాగరికతల ఆడపిల్లలు భ్రూణహత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వరకట్న మరణాలు మొదలైన వాటికి గురవుతున్నారు. వీటన్నింటిని రూపుమాపడానికి వచ్చిందే ‘జాతీయ బాలికల దినోత్సవం’. బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం వెనుక పెద్దచరిత్ర ఉంది. 1995లో బీజింగ్ జరిగిన మహిళల ప్రపంచ సదస్సులు, బీజింగ్ డిక్లరేషన్, ప్లాట్‌ఫారం ఫర్ యాక్షన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది మహిళలకు మాత్రమే కాకుండా బాలికల హక్కులను ముందుకు తీసుకెళ్లే అత్యంత ప్రగతిశీల విషయం.
బీజింగ్ డిక్లరేషన్ అనేది ప్రత్యేకంగా బాలికల హక్కులపై దృష్టిసారిస్తుంది. ఈ రోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, వారి మానవ హక్కులను నెరవేర్చే దిశగా వారిని శక్తివంతం చేయడంపై దృష్టి సారించింది. అణగారిన బాలికల హక్కుల తరపున ఒక గొంతు మాట్లాడాలనేదే ఈ రోజు ప్రాముఖ్యత. బాలికలకు మెరుగైన ఆరోగ్య సేవలు, విద్యలో సమాన అవకాశాలు లింగ ఆధారిత వివక్ష, బాలికలపై హింసలేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యుక్తవయసులో ఉన్న బాలికలు ఈ క్లిష్టమైన నిర్మాణ సంవత్సరాలలో మాత్రమే కాకుండా వారు స్త్రీలుగా పరిపక్వం చెందుతున్నప్పుడు, చెందిన తర్వాత కూడా సురక్షితమైన, విద్యావంతులైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. బాలికలకు యుక్తవయసులో సమర్థవంతంగా మద్దతు ఇస్తే బాలికలు ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈనాటి సాధికారత కలిగిన బాలికలుగా, రేపటి సలహాదారులుగా, ఇంటి పెద్దలుగా, కార్మికులుగా, తల్లులుగా, వ్యవస్థాపకురాలుగా, రాజకీయ నాయకులుగా, ఇంకా ఎన్నోరంగాలలో మంచిచెడు ఆలోచించి ముందంజ వేయగలరు.
యుక్తవయసులో ఉన్న బాలికలు గ్రహించిన శక్తిజ్ఞానం అనేది పెట్టుబడిగా వారి హక్కులను సమర్థిస్తుంది. మరింత సమానమైన సంపన్నమైన భవిష్యత్తును రేపటి వారి తరానికి వాగ్దానం చేస్తుంది. ఇందులో వాతావరణ మార్పు, రాజకీయ సంఘర్షణ, ఆర్థిక అభివృద్ధి, వ్యాధుల నివారణ, సమస్యలను పరిష్కరించడంలో సగం మానవాళి సమాన భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఇందులో భాగంగానే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉండటమే కాకుండా భవిష్యత్తు కోసం ఆశాజనకంగా ఉంటారని ఇటీవల విశ్లేషణలు చెబుతున్నాయి. అబ్బాయిల కంటే అమ్మాయిలు అన్ని రంగాల్లో తమను బాగా నిరూపించుకుంటున్నారు. వారి కృషి, అంకితభావం కారణంగా వారు అంతరిక్షంలోకి కూడా వెళ్లారు, వెళ్లగలుగుతున్నారు. వారు మరింత ప్రతిభావంతులుగా, విధేయులుగా, కష్టపడి పని చేసేవారుగా, కుటుంబం బాధ్యత వహిస్తారు. అంతేకాకుండా అమ్మాయిలు తమ తల్లిదండ్రుల పట్ల ఎక్కువ శ్రద్ధ, ప్రేమతో ఉంటారు. అన్నిటికంటే వారు ప్రతీపనిలో ముందంజ వేస్తు న్యాయం చేస్తారు. దేశాభివృద్ధిలో, సమాజాభివృద్ధిలో కూడా తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తారు.
సంయుక్త
85001 75459