- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెరలో శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు గురయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బైక్‌పై వెళ్తుండగా ఈరన్నను వేటకొడవళ్లతో నరికి హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలయాల్సి ఉంది.
- Advertisement -