Saturday, January 25, 2025

నేర నియంత్రణకు సిసి కెమెరాలు: ద్వారకా తిరుమలరావు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తీరప్రాంతంలో నేర నియంత్రణ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని డిజిపి ద్వారకా తిరుమలరావు తెలిపారు.  బాపట్ల జిల్లాలోని చీరాల ఒకటో పట్టణ పిఎస్ లో కోస్టల్ మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కారం చేడు పిఎస్ లో సిబ్బంది భవనాన్ని డిజిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల రావు మీడియాతో మాట్లాడారు. చీరాల, వేటపాలెం మండలాల్లో సముద్ర తీరప్రాంతాల్లో  30 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకుని, నేరాలను నియంత్రిస్తున్నారని డిజిపి ప్రశంసించారు. మార్చినాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News