Saturday, January 25, 2025

కామారెడ్డిలో ప్రియాంక చోప్రా.. మహదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఉన్నటుండి ఆలయాల చుట్టూ తిరుగుతోంది. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రియాంక వరుసగా ఆలయాలను సందర్శిస్తోంది. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో దోమకొండ మండల కేంద్రంలోని మహదేవుని ఆలయాన్ని సందర్శించింది ప్రియాంక. ఆలయంలో ప్రత్యేక పూజాలు చేసి.. స్వామివారి ఆశీర్వాదం తీసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను నటి ఇన్ స్టా స్టోరిలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా నుంచి వచ్చి రాగానే ముందుగా ఈ అమ్మడు.. చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం..శ్రీ బాలాజీ ఆశీర్వాదంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News