- Advertisement -
అమరావతి: ఎపి సాక్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే శుక్రవారం సిద్ధార్థ కాలేజీలో మొబైల్ వాహనాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రూ. 3 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మొబైల్ టెస్ట్ వాహనాలు అందిస్తామని స్పష్టం చేశారు. టెస్టింగ్ కోసం ఆస్పత్రి వరకు రాలేని వారికి వాహనాలను వాళ్ల దగ్గరకు తీసుకు వస్తారని మంత్రి సత్యకుమార్ వివరించారు. ఎయిడ్స్ అంటువ్యాది కాదు.. తొలి దశలోనే గుర్తిస్తే నియంత్రణ సాధ్యం అవుతుందని మంత్రి తెలియజేశారు.
- Advertisement -