Sunday, January 26, 2025

2022-23 ఆర్థిక ఆరోగ్య డేటా విడుదల చేసిన నీతి ఆయోగ్

- Advertisement -
- Advertisement -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా వ్యవహరించే నీతి ఆయోగ్ 2022-23 సంవత్సరానికి గాను ఆర్థిక ఆరోగ్య డేటాను విడుదల చేసింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్ తెలియజేసింది. ఆ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక ఆరోగ్య స్థితి అత్యంత దయనీయంగా ఉందని సంస్థ తెలిపింది. అదే సమయంలో తెలంగాణ ఎనిమిదవ స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2022-23లో పంజాబ్ మినహా తక్కిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య స్థితి బాగుండని సంస్థ వివరించింది. రాష్ట్రాల రెవెన్యూ సమీకరణ, వ్యయం, అప్పులు, చెల్లింపుల సామర్థం మొదలైన అంశాలు ప్రాతిపదికగా నీతి ఆయోగ్ ఈ నివేదిక రూపొందించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఈ నివేదికను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News