Sunday, January 26, 2025

శనివారం రాశి ఫలాలు(25-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. రాజకీయాల రంగాలలోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.

వృషభం –  ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు. అప్రయత్న కార్యసిద్ధి. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒక అవకాశం మీ దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోతారు.

మిథునం – ఆర్థిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలలో అభివృద్ధి సాధిస్తారు.

కర్కాటకం – అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు.ఇతరుల విషయాలలో జోక్యం మంచిది కాదు. అనుకోని అవకాశాలు మీకు చేతికి అందుతాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.

సింహం – బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు.  క్రమబద్ధ మైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు.

కన్య – మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి- వ్యాపారాల పరంగా సాధారణ ఫలితాలు అందుకుంటారు.

తుల – కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది. కొనుగోలు అమ్మకాలు అనుకూల వాతావరణంలో ఉంటాయి. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు.

వృశ్చికం – పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.

ధనుస్సు – ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

మకరం –  ధన వ్యయ సూచన కనిపిస్తుంది. ఉద్యోగవకాశాలు పొందుతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి బయటపడతారు. విహారయాత్రలు చేస్తారు. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి.

కుంభం –  పనులు నెమ్మదిగా సాగుతాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు.

మీనం – స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News