Sunday, January 26, 2025

రూ.5 కోట్లతో మార్వాడీ వ్యాపారి పరార్

- Advertisement -
- Advertisement -

బంగారం షాప్ వ్యాపారి బోర్డు తిప్పేసి ప్రజలకు టోకరా పెట్టిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట పట్టణంలో చోటుచేసుకుంది. రూ.5 కోట్లతో గురువారం అర్ధరాత్రి నుంచి బంగారం వ్యాపారి జితేందర్ కనిపించకుండా పోవడంతో స్థానికులు షాపు ఎదుట ఆందోళనకు దిగారు. పట్టణంలోని పాతగుట్ట చౌరస్తాలో ఉండే జైభవానీ జ్యువెల్లర్స్ యజమాని జితేందర్ బంగారంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తూ గత సంవత్సర కాలంగా యాదగిరిగుట్టలో నివసిస్తున్నాడు. గురువారం అర్ధరా త్రి నుంచి బంగారం షాపు యజమాని జితేందర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని బాధితులు తెలిపా రు. దీంతో ఆందోళనకు గురైన బాధితులు శుక్రవారం ఉదయమే షాపు దగ్గర వచ్చి చూసేసరికి షాపు మొత్తం ఖాళీగా కనిపించడంతో ఒక్కసాగు కంగుతిన్నారు. షాపు ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.

నమ్మకంగా ఉంటూనే ఇలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇతర మార్వాడీ షాపుల దగ్గర జితేందర్ గురించి ఆరా తీశారు. కాగా, బాధితులంతా షాపు ఎదుట కూర్చొని త మకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మార్వాడీలను నమ్మి మోసపోయామని, రాత్రికి రాత్రే నగలు, డబ్బులతో ఉడాయిస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితుల ఆందోళనకు మద్దతుగా నిలుస్తూ స్థానిక నేతలు, పలువురు ప్రజలు ధర్నాకు దిగారు. బంగారం వ్యాపారి జితేందర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలం టూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానికులు, బాధితులు కోరుతున్నారు. రూ.5 కోట్ల కం టే ఎక్కువే ఉంటుందని, 100 మందికిపైగా బాధితులు ఉండొచ్చని స్థానికులు తెలిపారు.

మార్వాడీ దుకాణాల ఎదుట ఆందోళన
యాదగిరిగుట్టలో బంగారం వ్యాపారి రూ.5 కో ట్లతో ఉడాయించడంతో బాధితులు పట్టణంలోని ఇతర మార్వాడీల దుకాణాల ఎదుట ఆందోళనకు దిగారు. రూ.5 కోట్లతో ఉడాయించిన జితేందర్ ఆచూకీ తెలపాలని డిమాండ్ చేశారు. జైభవానీ జ్యువెలరీ పక్కనే ఉన్న మరో జ్యువెలరీ షాపు ఎదుట బాధితులతో పాటు మరికొందరు ధర్నా కు దిగారు. ఇతర మార్వాడీ బంగారం షాపుల్లోని కస్టమర్లు తమ బంగారం, డబ్బులకు గ్యారంటీ లేదని, వెంటనే తమ నగదు, డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపు చేశారు.

జైభవానీ జ్యువెల్లర్స్ బాధితులు వీరే
యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెం దిన తమ్మడి సుదర్శన్ జ్యోతి దంపతులు 16 తు లాల బంగారం తాకట్టు పెట్టి రూ.5 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు.
యాదగిరిగుట్ట మండలం , సైదాపురం గ్రామానికి చెందిన షేక్‌గౌస్ రూ.2 లక్షల వరకు మోసపోయినట్టు తెలిపారు. అదే వి ధంగా యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన గుండు జ్యోతి 7 తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 2.10 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. సుదగాని స్వప్న 20 తులాల బంగారం తాకట్టు పెట్టి రూ. 10 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News