Monday, January 27, 2025

మా దగ్గర రూ.20 లక్షలే ఉన్నాయి.. ఐటి తనిఖీలపై దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

ఐటీ సోదాలు అనేది కామన్‌.. అకౌంట్‌ బుక్స్‌ చెక్‌ చేసి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటి రెయిడ్స్ పై స్పందించారు. కొంతమంది తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ తనిఖీలు సాధారణమన్నారు.

“తమ ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఐటీ రెయిడ్స్‌ జరిగినప్పుడు మా దగ్గర రూ.20 లక్షల లోపే డబ్బులు ఉన్నాయి. ఐదేళ్లుగా మేం ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదు. ఐటీ అధికారులు అడిగిన వివరాలన్నీ ఇచ్చాం. సినిమాకు సంబంధించిన వివరాలు అడిగారు.. ఇచ్చాం. ఐటీ అధికారులు నిన్న నాతో మాట్లాడారు. మేం ఇచ్చిన పత్రాలన్నీ ఐటీ అధికారులు తనిఖీ చేస్తారు. మా లావాదేవీలన్నీ చాలా క్లీన్ గా, క్లియర్‌గా ఉన్నాయి. డబ్బులు, డాక్యుమెంట్లు ఏవీ స్వాధీనం చేసుకోలేదు. ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మా అమ్మకు ఆరోగ్య బాగాలేదని ఆస్పత్రిలో చేర్చాం.. ఇప్పుడు బాగానే ఉన్నారు..డిశ్చార్జ్ చేస్తారు.మాపై తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నా” అని దిల్‌రాజు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News