Monday, January 27, 2025

31న ఉస్మానయా ఆసుపత్రికి శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రానున్న వం దేళ్ల అవసరాలకు తగినట్లు పూర్తి ఆధునిక వ సతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధిం చి ఏ విషయంలోనూ రాజీపడొద్దని ఆయన అధికారులకు సూచించారు. ఉస్మానియా ఆ సుపత్రి నిర్మాణానికి ఈ నెల 31వ తేదీన ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి శనివారం స మీక్ష నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాలతో పాటు బోధన సిబ్బంది, విద్యార్థి, విద్యార్థినులకు వేర్వురుగా నిర్మించే హాస్టల్ భవనాల విషయంలోనూ పూర్తి నిబంధనలు పాటించాలని సిఎం రేవంత్ రెడ్డి సూ చించారు. ఆసుపత్రి భవన నిర్మాణాలు, పా ర్కింగ్, ల్యాండ్ స్కేప్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సిఎం తెలిపారు. ఆసుపత్రికి రాకపోకలు సాగించేలా నలువైపులా ర హదారులు ఉండాలని అవసరమైనచోట ఇత ర మార్గాలను కలిపేలా అండర్‌పాసులు ని ర్మించాలని సిఎం సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులు, పరామర్శకు వ చ్చే వారి వాహనాలు నిలిపేందుకు వీలుగా అండర్‌గ్రౌండ్‌లో  రెండు ఫ్లోర్లలో పార్కింగ్ ఉండాలన్నారు.

మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో
డార్మెంటరీ, ఫైర్ స్టేషన్, క్యాంటిన్, మూత్రశాలలు, ఎస్టీపిలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుండడంతో వారు వచ్చేందుకు రెండు, మూడు రోజులు పడుతోందని అప్పటివరకు మృతదేహాలను భద్రపర్చేందుకు ఆధునిక సౌకర్యాలతో మార్చురీ, బాడీ ఫ్రీజింగ్ నిర్మాణాలు ఉండాలని సిఎం సూచించారు. అవయవాల మార్పిడి అత్యవసర సమయాల్లో రోగుల తర లింపునకు వీలుగా హెలీ అంబులెన్స్‌ను వినియోగిస్తున్నందున హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టాలని సిఎం ఆదేశించారు.

ఆసుపత్రిలో అడుగుపెట్టగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలని, ఆసుపత్రికి వచ్చామన్న భావన ఉండకూడదని సిఎం సూచించారు. ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు, చేర్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి సంగీత సత్యనారాయణ, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తూ, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News