Monday, January 27, 2025

కెసిఆర్, హరీశ్‌రావుకు ఘోష్ కమిషన్ నోటీసులు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచార ణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ విచారణ ను ముమ్మరం చేయాలని భావిస్తున్నది. మరో నెల రోజుల పా టు కమిషన్ విచారణ కొనసాగించే అవకాశాలున్నాయి. ఇం దులో భాగంగా గత ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకున్న ఆనా టి కేబినెట్ సబ్ కమిటీని కూడా కమిషన్ విచారణకు పిలువనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నాటి ప్రభుత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, మాజీ నీటిపారుదల శాఖ మం త్రి టి.హరీశ్‌రావు, ఆనాటి మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన విచారణలో డిజైన్ల అంశంపై నిర్మాణ సంస్థలు ప్రధానంగా ప్రస్తావించిన నేపధ్యంలో డిజైన్ల రూపకల్పనలో తాను భాగస్వామ్యమైనట్లుగా గతంలో వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అయితే క్రియాశీలక రాజకీయనాయనేతలను విచారణకు పిలి చే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ

సమాచారం. ఇటీవల వి.ప్రకాశ్ విచారణ సందర్భంగా కమిషన్ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వరాదని స్పష్టంచేసింది. ఇదే నేపధ్యంతో మున్ముందు రాజకీయ ప్రముఖులను విచారణకు హాజరయ్యే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికే పరిమితం అయ్యేలా వారి ఆలోచనలు ఉండాలని, కమిషన్ అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా, సూటీగా సమాధానాలు ఇవ్వాలని కమిషన్ ముందస్తుగానే హెచ్చరించినట్లుగా తెలుస్తున్నది. కాగా ఇప్పటికే సాంకేతికపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన నిర్మాణ సంస్థలు నవయుగ, ఎల్ అండ్ టీ, ఫాల్కాన్ ప్రతినిధులను విచారించింది. వాటి క్రాస్ ఎగ్జామిన్‌లో అనేక అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించి వాస్తవాలను పరిశీలించే ప్రయత్నం చేసింది. ఇప్పటి వరకు దాదాపు వంద మందికిపైగా కమిషన్ విచారించింది. నిర్మాణ సంస్థలు కమిషన్‌కు అందజేసిన అఫిడవిట్లు అన్నీ ఒకే రీతిలో ఉండడంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. అందరూ కూడబలుక్కుని కాపీ పేస్ట్ తరహాలు అఫిడవిట్లు అందజేసినట్లుగా ఉన్నాయని జస్టిస్ పీసీ ఘోట్ వ్యాఖ్యానించడం గమనార్హం.

నాణ్యతపై మీ ధ్యాస ఎక్కడ ?
కాళేశ్వరం కమిషన్ శనివారం నాడు అన్నారం బ్యారేజ్ నిర్మించిన ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులను విచారించింది. ఈ సందర్భంగా ఆఫ్కాన్స్ ప్రతినిధి నాగ మల్లికార్జున్‌రావును క్రాస్ ఎగ్జామిన్‌లో కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వలేకపోయారు. టెండర్‌లో భాగస్వామ్యం కావడానికి ముందు అన్ని కోణాల్లో ప్రాజెక్టు సాంకేతిక అంశాలను, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించారా ? అని కమిషన్ ప్రశ్నించింది. దానికి బదులుగా తాము ఎంటర్ అయిన ఏడాది తర్వాత భూసేకరణ జరిగిందని, అప్పటి వరకు తమ కంపెనీ స్థానికంగా అందుబాటులో ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. 2018 సెప్టెంబర్ నాటికి గేట్లు తప్ప మిగతా మెజారిటీ బ్యారేజ్ పనులు పూర్తి అయ్యాయని, దాదాపు ఐదు లక్షల క్యూసెక్కుల వాటర్ రివర్‌లో ఉందని, వరద సమయంలో ప్రొటెక్షన్ వర్క్, డౌన్ ట్రీమ్, అప్ స్ట్రీమ్‌లో ప్రొటెక్షన్ వాల్స్ పూర్తి అయ్యాయని, ఆనాడు వరదల సమయంలో ఒక్క సింగిల్ బ్రేక్ రాలేదని తెలిపారు.

2019 జనవరిలో గేట్ల పనులు పూర్తి అయ్యాయని, జూలై 2019లో గేట్లు మూసివేశామని, పంపింగ్ స్టేషన్ల పనులు చేశామని, అక్టోబర్, నవంబర్‌లో గేట్లు ఓపెన్ చేసి షూటింగ్ వెలాసిటీని పరిశీలించామని, ప్రారంభంలో సీసీ బ్లాక్స్ డిస్ట్రబ్ అయ్యాయని, ఆ తర్వాత సిసి బ్లాక్స్‌ను రిస్టోర్ చేశామని చెప్పారు. 2020 వరదల సమయంలో కూడా అవే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయని తెలిపారు. సీపేజ్‌లను గుర్తించి ఢిల్లీ నుంచి నిపుణులను తీసుకువచ్చి పనులు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా జస్టీస్ పీసీ ఘోష్ ప్రాజెక్టు కాలం వందేళ్లు ఉండాలి, కనీసం 45 సంవత్సరాలు ఉండాలి కానీ ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా టెండర్ వేయడానికి ముందు అన్నీ పరిశీలిస్తాం, కానీ ఇక్కడ ఐటమ్ వారీగా కాంట్రాక్టు ఉండడం వల్ల లోతుగా పరిశీలించలేదని సమాధానం ఇచ్చారు. దాంతో కమిషన్ నేను స్వయంగా వెళ్లి ప్రత్యక్షంగా అన్నీ పరిశీలించాను, మీ పేమెంట్ పార్ట్ వేరు, వర్క్ పార్టు వేరు దానికి దీనికి లింక్ పెట్టవొద్దని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News