- Advertisement -
యువకులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సున్నిపెంట రోడ్డులో చోటుచేసుకుంది.సున్నిపెంటకు చెందిన రామ్ నాయక్‌తో పాటు మరో ఇద్దరు యువకులు స్కూటిపై శ్రీశైలానికి వెళ్తుండగా.. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి వారిపై ఎటాక్ చేసింది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న ముగ్గురిలో ఇద్దరి యువకులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -