Friday, February 14, 2025

ట్రంప్‌తో మోడీ ఫోన్ సంభాషణ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఫోన్ సంభాషణ జరిపారు. భారత్, యుఎస్ సంబంధాల వృద్ధిని కొనసాగించడం లక్ష్యంగా వారి మధ్య చర్చలు జరిగాయి. ఉభయ పక్షాలు పరస్పర ప్రయోజనకర, విశ్వసనీయ భాగస్వామ్యానికి నిబద్ధమై ఉన్నాయని ఫోన్ చర్చల అనంతరం మోడీ తెలియజేశారు. ‘నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడడం ఆనందం కలిగించింది. చరిత్రాత్మకమైన ఆయన రెండవ విజయానికి అభినందించాను’ అని ప్రధాని మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘మేము పరస్పర ప్రయోజనకర, విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాం. మా ప్రజల సంక్షేమార్థం, ప్రపంచ శాంతి, సౌభాగ్యం, భద్రత దిశగా కలసి కృషి చేస్తాం’ అని మోడీ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News