- Advertisement -
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నార్కట్ పల్లి రోడ్డులోని మంజుల కూరగాయల దుకాణంలో దొంగతనం జరిగింది. గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకుని పల్సర్ బైక్ పై వచ్చిన దొంగ షాపు క్లోజ్ చేసేందుకు డబ్బు బ్యాగ్ లో పెట్టి కౌంటర్ పై పెట్టగా దొంగ బ్యాగ్, స్మార్ట్ సెల్ ను ఎత్తుకెళ్లాడు. బ్యాగ్ లో రూ.45 వేలు ఉన్నాయని, మొబైల్ రూ.35 వేలు ఉంటుందని బాధితురాలు మంజుల తెలిపింది. ఇదిలా ఉండగా చెరువు కట్ట పై పండ్ల అమ్ముకునే మరో మహిళ దుకాణం లో కూడా దొంగతనం జరిగినట్టు వట్టెపు ఉప్పలమ్మ తెలిపింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.
- Advertisement -