Saturday, March 1, 2025

పెట్టుబడులపై ప్రగల్భాలే…

- Advertisement -
- Advertisement -

నిరుడు చెప్పిన రూ. 42వేల కోట్లలో నేటికి ఒక్కటీ రాలేదు
దావోస్ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయో..ఎన్ని ఉద్యోగాలు
ఇస్తారో సిఎం చెప్పాలి : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్ :దావోస్‌కు పోయి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన పెట్టుబడులపై కాంగ్రెసోళ్లు పెట్టిన హోర్డింగ్స్ చూసి ఏడ్వాలో.. నవ్వాలో అర్ధం కావడంలేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. సోమవా రం తెలంగాణ భవన్‌లో విద్యార్ధి విభాగం డైరీని ఆయన ఆవిష్కరించిన అనంతరం ఆ యన మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి లక్షా 78వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు బిల్డ ప్స్ ఇచ్చుడు కాదు, 2024లో కూడా రూ. 42వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో చె ప్పారు కానీ నేతిబీరకాయ చందంలాగా అందులో ఇవ్వాల్టికి ఒక్కటి కూడా రాలేద ని కేటీఆర్ తెలిపారు. అందుకే ప్రజలు మి మ్ముల్ని నమ్ముతలేరు, చేతనైతే ఎప్పటిలో గా పెట్టబడులు వస్తాయో చెప్పు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తా యో చెప్పు మేము సంతోషిస్తామని కేటీఆర్ ఎద్దేవ చేశారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తే సంతోషించే వారిలో తాము ముందుం టాం, మాకంటే ఎక్కువ చేసి చూపెడితే మే ము నీకు సన్మానం కూడా చేస్తామని కేటీఆర్ అన్నారు. తమ పదేళ్ళ పాలనలో కొత్త రేషన్ కార్డులు

ఇవ్వలేదని కాంగ్రెస్ మంత్రులు అబద్దాలు అడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. 2021 లోనే మా ప్రభుత్వం ఆరు లక్షల 47 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని, ఆనాడు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో నేటి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారని అన్నారు. పదేండ్ల బిఅర్‌ఏస్ పాలనలో అన్ని రకాలుగా విద్యారంగాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అప్పుడు 294 ఉన్న గురుకులాలు నుంచి వెయ్యికిపైగా పెంచుకున్నాం, ఐదు మెడికల్ కాలేజీలను జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటు చేసుకున్నాం, ఒక ఫారెస్ట్ యూనివర్సీటీ, మహిళా యూనివర్సీటీ ఏర్పాటు చేసి వాటికి మహనీయుల పేర్లు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు హామీ ఇచ్చి 400 రోజులు గడిచిన సందర్భంగా జనవరి 31 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి నిరసన వ్యక్తం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకుపోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News