Thursday, January 30, 2025

దక్షిణ భారతదేశంలో సుప్రీం బెంచ్ అవసరమే!

- Advertisement -
- Advertisement -

భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు, దేశంలో మూడంచెల న్యాయ వ్యవస్థ మనకి ఉంది, అందులో జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు, జిల్లా స్థాయిలో న్యాయం దొరకకపోతే, రాష్ట్ర హైకోర్టుకు అప్పీల్ కు వెళ్ళవచ్చు, హైకోర్ట్ లో న్యాయం దొరకపోతే అంతిమ న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సి వెళ్ళవచ్చు, ఇలా మూడు రకాలుగా మన దేశంలో న్యాయ వ్యవస్థ పని చేస్తుంది, అయితే సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సి వస్తె ఢిల్లీకి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఎంతో మంది దక్షిణ భారతదేశ ప్రజలు సుప్రీం వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసలుతో కూడుకున్న పనిగా ఉంది ఆని చెప్పాలి.

పెరుగుతున్న పెండింగ్ కేసులు
దేశ వ్యాప్తంగా జూనియర్ సివిల్ కోర్టు స్థాయి నుండి సుప్రీం కోర్టు వరకు ఏటా ఏటా పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి, గత ఏడాదికి ఐదు కోట్లకు పైన కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి, అందులో మ్ఫు ఏళ్లకు పైబడిన కేసులు హై కోర్టు మరియు జిల్లా స్థాయిలో లక్షన్నర పైనే ఉన్నాయి, ఇందులో భూమి, ప్రాపర్టీ సంబంధిత కేసులు 66 శాతం మేర ఎక్కువగా ఉన్నాయి,ఒక్క సుప్రీం కోర్టు లోనే 80 వెలకు పైనే పెండింగ్‌లో ఉన్నాయి, గత నాలుగేళ్లలో 14 వేలకు పైగా పెరిగాయి, ఇందులో ఎక్కువ శాతం సివిల్ నమోదు అవుతున్నాయి, దీనికి ప్రధాన కారణం గా జడ్జీల కొరత ఎక్కువగా కనిపిస్తుంది, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ కక్షి దారులు తిరుగుతూనే ఉన్నారు.

భౌగోళికంగా సుప్రీం కోర్టు దూరం
వాస్తవానికి సుప్రీం కోర్టు లో కేసు వేయాలని ఎంతో మంది కక్షిదారులకు ఉంటుంది, కానీ సుప్రీం కోర్టు ఉన్నది మాత్రం డిల్లీలో, అయితే దక్షిణ భారతదేశ ప్రజలు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్న వకీల్ పట్టుకొని కేసులు వెయ్యాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పాలి, ఎందుకంటే ఉదాహరణ కు తమిళనాడు ప్రజలు వెళ్ళాలంటే తమిళనాడు నుండి, డిల్లీకి 2428 కిలోమీటర్లు ఉంది, అంటే దాదాపు ప్రయాణం విమానం లో వెళ్లిన ఖర్చు అధికంగా వస్తుంది, ఒకవేళ ట్రయిన్ లో వెళ్లిన మూడు నుండి నాలుగు దినాలు కనీసం పడుతుంది, వెళ్లి అక్కడ ఉన్న న్యాయవాదులను సంప్రదించి అక్కడ ఉండి, అక్కడ వాతావరణం పడకపోవడం మరియు, మళ్ళీ వాయిదలకు తిరగాలంటే పుణ్య కాలం కాస్త పూర్తి అయిపోతుంది, కాబట్టి అదే తంతు దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా పడమర దిక్కున ఉన్న రాష్ట్రాలకు సైతం చాలా కష్టమైన పనే అని చెప్పుకోవచ్చు, అటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళాలంటే వాళ్లకు వ్యయా ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం అని చెప్పవచ్చు.

దక్షిణ భారతంలో బెంచ్..
సుప్రీం కోర్టు మరొక బెంచ్ ను దక్షిణాన పెడితే దక్షిణ భారతదేశ ప్రజలుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పొచ్చు, అందులో హైదరాబాద్ కేంద్రంగా పెడితే దక్షిణాన ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, రాష్ట్రాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది, అదేవిధంగా స్థానికంగా ఉంటారు కాబట్టి స్థానిక చట్టాలకు అవలలోకం చేసుకొని వెను వెంటనే తీర్పులు చెప్పే అవకాశం మెండుగా ఉంటాయి, గతంలో 2009లో 229వ ‘లా కమిషను రిపోర్ట్‘ కూడా రీజినల్ సుప్రీం కోర్టు బెంచ్ లు పెట్టొచ్చు అని ప్రతిపాదనలు చేసింది, అందులో హైదరాబాద్, కొలకత్తా, ముంబాయి, చెన్నై, లాంటి ప్రాంతాల్లో, రాజ్యంగేతర వంటి కేసులు వినడానికి పెట్టొచ్చు అని ప్రతిపాదనలు చేసింది, కాబట్టి సౌత్ లో బెంచ్ పెడితే సుప్రీం కోర్టులో ఉన్న కేసులు అన్నీ ఆయా బెంచ్ లకు వెళ్లి తీర్పులు వెంటనే రావటానికి ఆస్కారం ఉంటుంది, అదేవిధంగా స్థానికంగా ఎంతో మంది సుప్రీం కోర్టు వెళ్ళడానికి వీలు కలుగుతుంది, కాబట్టి దక్షిణ భారతదేశంలో మరో బెంచ్ పెట్టాలని కోరుకుందాం.
-బొమ్మరగొని కిరణ్ ఫిషర్, అడ్వకేట్, తెలంగాణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News